రేణిగుంట–తిరుపతి ప్రధాన రహదారిలోని రేణిగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జిపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రేణిగుంట పట్టణం నుంచి తిరుపతి వైపు వెళ్తున్న యువకుడు ఫ్లైఓవర్‌పై అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి యువకుడిని తిరుపతిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.