నటుడు సుమన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. అన్నమయ్య సినిమాలో శ్రీవారి పాత్ర పోషించడం తన జన్మధన్యత అని, ప్రస్తుతం చేస్తున్న పాత్రలన్నీ టైంపాస్ మాత్రమేనని ఆయన అన్నారు. ఆయనతో పాటు డైరెక్టర్లు గోపీచంద్, బాబి, కోనవెంకట్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, గాయకుడు చిన్ని కృష్ణ తదితరులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.