హైదరాబాద్‌కు చెందిన అపర్ణ కన్‌స్ట్రక్షన్స్, ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1 కోటి విరాళం అందించింది. సంస్థ ప్రతినిధులు తరుణ్, రమేష్ మంగళవారం తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బి. ఆర్. నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా పేద ప్రజల ప్రాణరక్షణకు చేయూతనిచ్చే మహోన్నత సేవలో భాగస్వాములైన అపర్ణ సంస్థ యాజమాన్యాన్ని చైర్మన్ బి. ఆర్. నాయుడు అభినందిస్తూ, వారి దాతృత్వాన్ని కొనియాడారు.