తిరుపతిలో గంజాయి విక్రయిత అరెస్ట్

111చూసినవారు
తిరుపతిలో గంజాయి విక్రయిత అరెస్ట్
తిరుపతి రూరల్ పోలీసులు శనివారం ఎం. కే. నాయుడు కాలనీ, అవిలాల కాసు వద్ద సాయి ప్రసాద్ అనే గంజాయి విక్రేతను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 1.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్నేహితుడు గౌరీ శంకర్‌తో కలిసి ఒడిశాలోని బరంపూర్ నుంచి గంజాయిని తెచ్చి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. 10 గ్రాముల ప్యాకెట్లుగా చేసి ఒక్కో ప్యాకెట్‌ను రూ. 500కు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.