బాలాయపల్లి మండలంలోని కయ్యూరు ఎస్సీ కాలనీలో రెండేళ్ల బాలుడు సుమన్ ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. కుటుంబ సభ్యులు బాలుడిని వెంటనే వెంకటగిరి ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కల బెడద తీవ్రమైందని, పలుమార్లు సచివాలయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.