వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కొండపై చలి కూడా అధికమైంది. దీంతో చిన్నారులు, వృద్ధులతో వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చలిని తట్టుకోవడానికి తగిన దుస్తులు తీసుకురావాలని సలహా ఇచ్చారు. అంతేకాకుండా, తిరుమలలో తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. ఇటీవల నాగరత్నమ్మ అనే మహిళ ఓ భక్తురాలికి మత్తుమందు కలిపిన పాలు ఇచ్చి, క్యూలైన్‌లో బంగారు తాళిబొట్టు దొంగిలించిన సంఘటన నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేశారు. కొండపై తెలియని వ్యక్తులు ఇచ్చే పదార్థాలను స్వీకరించవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.