శనివారం కోట ఆర్టీసీ బస్టాండ్ వద్ద డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఒక బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం, ఆర్టీసీ బస్సు అతివేగంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.