బీఎన్ కండ్రిగ: విద్యుదాఘాతంతో ఒప్పంద ఉద్యోగి మృతి

0చూసినవారు
బీఎన్ కండ్రిగ: విద్యుదాఘాతంతో ఒప్పంద ఉద్యోగి మృతి
బీఎన్ కండ్రిగ మండలంలోని నీర్పాకోట ఎస్సీ కాలనీకి చెందిన కిన్నెర సాంబ చిన్నయ్య (41) అనే విద్యుత్ ఉప కేంద్రం ఒప్పంద ఉద్యోగి, మొంథా తుపాను ప్రభావంతో మరమ్మతుకు గురైన విద్యుత్ తీగలను సరిచేస్తుండగా, శుక్రవారం లక్ష్మీపురం ఎస్టీ కాలనీ సమీపంలో 11 కేవీ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గత 20 ఏళ్లుగా ఆ గ్రామంలో విద్యుత్ సమస్యలు వస్తే సత్వరమే స్పందించి సేవలు అందించే సాంబ చిన్నయ్య మృతితో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల క్రితం కూడా విద్యుదాఘాతానికి గురై కోలుకున్నాడు.

సంబంధిత పోస్ట్