కాకినాడకు చెందిన 17 ఏళ్ల బాలుడిని తల్లిదండ్రులు మందలించడంతో, ఎవరికీ చెప్పకుండా 3 రోజుల కిందట తిరుమలకు వచ్చాడు. కొండపై ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని II టౌన్ పోలీసులు గుర్తించి, తమ సంరక్షణలోకి తీసుకున్నారు. SP సుబ్బారాయుడు ఆదేశాల మేరకు బాలల సంక్షేమ కమిటీకి అప్పగించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించి, ఆధారాలు చూపిన తర్వాత బాలుడిని వారికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.