BREAKING: తిరుపతిలో దారుణ హత్య

2078చూసినవారు
తిరుపతి చింతలచేను రోడ్డులోని మంజునాథ ట్రావెల్స్‌లో దారుణం జరిగింది. డ్రైవర్ సెల్వరాజ్‌ (55)ను క్లీనర్ గోపి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సెల్వరాజ్ తల వెనుక భాగంలో గోపి బలంగా కొట్టి ప్రాణాలు తీశాడని సమాచారం. హత్య అనంతరం నిందితుడు గోపి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు

సంబంధిత పోస్ట్