రేణిగుంటలో మేనక అనే యువతి దారుణ హత్య కేసులో పోలీసులు నిందితుడు చిరంజీవిని అరెస్ట్ చేశారు. గుంటూరు SP వివరాల ప్రకారం, బాపట్ల(D) వెల్లబాడుకు చెందిన
చిరంజీవి, రేణిగుంటలో పనిచేస్తూ అక్కడే ఉంటున్న మేనకతో మూడేళ్లు సహజీవనం చేశాడు.
చిరంజీవి మరో పెళ్లి చేసుకోవడంతో మేనక పంచాయితీ పెట్టగా రూ. 5 లక్షలకు రాజీ కుదిరింది. మే 29న మళ్లీ గొడవ జరగడంతో
చిరంజీవి మేనకను హత్య చేసి కాలువలో పడేశాడు. పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.