తిరుపతి అలిపిరి పరిధిలో నవంబర్ 18న ఉపాధ్యాయ నగర్ వద్ద ఆటో కోసం వేచి ఉన్న శ్రీధర్ అనే వ్యక్తి వద్ద బంగారు చైన్ లాక్కెళ్లిన కేసును పోలీసులు ఆదివారం ఛేదించారు. రేణిగుంట, కరకంబాడీకి చెందిన మహేష్, జయలక్ష్మణ్ కుమార్, జాఫర్, ప్రభుదాస్‌ను అరెస్టు చేసినట్లు సీఐ రామ కిషోర్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 25 వేల నగదు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో మరో ఇద్దరు పరారీలో ఉండగా గాలింపు కొనసాగుతోంది.