పేలుడు ఘటనపై స్పందించిన సీఎం

0చూసినవారు
పేలుడు ఘటనపై స్పందించిన సీఎం
తిరుపతి జిల్లాలోని శ్రీసిటీ పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలపై సీఎం అధికారులను ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ఆదేశించారు. కార్మిక శాఖ మంత్రి సుభాష్ ప్రమాద స్థలిని పరిశీలించేందుకు బయల్దేరారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించిన మంత్రి, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపడుతామని వివరించారు.

సంబంధిత పోస్ట్