సిపిఐ శతవసంతాల సందర్భంగా ఆదివారం తిరుపతి ఎం. ఆర్. పల్లిలో 6వశాఖ మహాసభను ఆదివారం ఘనంగా నిర్వహించారు. శాఖ కార్యదర్శి కేటీ సాయిచలం రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి పి. మురళి పాల్గొని ఎర్రజెండాను ఆవిష్కరించారు. సిపిఐ 100 ఏళ్ల అజిరామమైన చరిత్ర, త్యాగాలు, ప్రజా పోరాటాలను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి విప్లవ గేయాలతో చైతన్యం నింపారు.