కుక్కల దాడిలో జింక మృతి

4చూసినవారు
కుక్కల దాడిలో జింక మృతి
తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్‌లోని 'సి బ్లాక్' సమీపంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఒక జింకపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జింక అక్కడికక్కడే మృతి చెందింది. యూనివర్సిటీ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు జింక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టంకు తరలించారు.

సంబంధిత పోస్ట్