తిరుచానూరులో భక్తురాలు మృతి

387చూసినవారు
తిరుచానూరులో భక్తురాలు మృతి
తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయం మూడో గేటు వద్ద విజయవాడ భవానిపురానికి చెందిన కృష్ణవేణి(28) అనే భక్తురాలు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందింది. కుటుంబ సభ్యులతో కలిసి దర్శనానికి వచ్చిన ఆమె అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్