తిరుపతి గోశాలలో తాగుబోతు ఒకరు మద్యం మత్తులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై సిబ్బంది టీటీడీ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయడంతో, నిందితుడిని అలిపిరి తనిఖీ కేంద్రంలోని ఏవీఎస్వో కార్యాలయానికి తరలించారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.