ఏర్పేడు మండలం కుప్పయ్యకండ్రిగలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న వెంకటరమణ (22) అనే యువకుడు పశువులకు గడ్డి తెచ్చేందుకు పొలానికి వెళ్లినప్పుడు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.