ఏర్పేడు: టీడీపీ కార్యకర్త మృతి

3చూసినవారు
ఏర్పేడు: టీడీపీ కార్యకర్త మృతి
ఏర్పేడు మండలం ఆమందూరు పంచాయతీలో టీడీపీ కార్యకర్త సుబ్రహ్మణ్య యాదవ్ ఆకస్మికంగా మృతిచెందారు. ఈ వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని, సుబ్రహ్మణ్య యాదవ్ భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. సుబ్రహ్మణ్య యాదవ్ మృతి పార్టీకి తీరని లోటు అని, వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్