ఏర్పేడు: అంబులెన్స్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

6చూసినవారు
ఏర్పేడు: అంబులెన్స్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద 108 అంబులెన్స్‌లో ఒక మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటగిరిలోని ఆంజనేయపురం చెందిన మహిళ కాన్పు కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి రాగా, వైద్యులు ఆమెను తిరుపతికి రెఫర్ చేశారు. తిరుపతికి తరలిస్తుండగా, తొట్టంబేడు 108 సిబ్బంది మేర్లపాక వద్ద అంబులెన్స్‌లోనే ప్రసవం చేయించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని సమాచారం.