గొర్రెలు మేపుతుండగా పిడుగుపాటు, జేబులో ఫోన్ పేలి రైతు మృతి

1586చూసినవారు
గొర్రెలు మేపుతుండగా పిడుగుపాటు, జేబులో ఫోన్ పేలి రైతు మృతి
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం శిరసనంబేడులో బుధవారం సంచి సిద్ధార్థ (48) అనే రైతు తన గొర్రెలను మేతకు తీసుకెళ్లినప్పుడు ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుపాటుకు గురయ్యాడు. ఈ దుర్ఘటనలో అతని జేబులోని ఫోన్ పేలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్