తిరుమల క్యూలైన్లో గొడవ.. బెల్ట్‌తో దాడి

455చూసినవారు
తిరుమల పుణ్యక్షేత్రంలో సర్వదర్శనం క్యూలైన్‌లో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో ఒక వ్యక్తి బెల్ట్‌తో మరొకరిపై దాడి చేయడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇతర భక్తులు జోక్యం చేసుకుని గొడవను ఆపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. టీటీడీ భక్తులు సంయమనం పాటించాలని సూచించింది.

సంబంధిత పోస్ట్