తిరుపతి తొక్కిసలాట ఘటనలో విశాఖకు చెందిన రజినీ మృతి చెందారు. ఆమె తొలిసారిగా తిరుపతికి వచ్చినట్లు ఆమె భర్త లక్ష్మణరెడ్డి తెలిపారు. తొక్కిసలాట జరిగినప్పుడు తానూ అక్కడే ఉన్నానని తెలిపారు. అస్వస్థతకు గురైన ఓ మహిళను ఆలయ సిబ్బంది గేట్లు తీసి తమ ముందు నుంచే తీసుకెళ్లారన్నారు. అప్పుడు జరిగిన తొక్కిసలాటలోనే రజినీ తప్పిపోయిందని ఆతరవాత రెండు గంటల తర్వాత రుయాలో మృతదేహం కనిపించిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.