పుత్తూరు చర్చి కాంపౌండ్లో పెద్దపాము

3చూసినవారు
పుత్తూరులోని చర్చి కాంపౌండ్ వద్ద తెల్లవారుజామున నాగుపాము కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించగా, అతను అక్కడికి చేరుకుని చాకచక్యంగా పామును పట్టుకున్నాడు. అనంతరం, పామును సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా పుత్తూరులో పాములు ఇళ్లలోకి చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని, ఇది తరచుగా జరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్