రీల్స్ చేస్తూ 5వ అంతస్తు నుంచి కిందపడి బాలిక మృతి

298చూసినవారు
రీల్స్ చేస్తూ 5వ అంతస్తు నుంచి కిందపడి బాలిక మృతి
తిరుపతిలోని రాజారెడ్డి నగర్ సాయి నివాస్ అపార్ట్‌మెంట్‌లో నిన్న సాయంత్రం 13 ఏళ్ల పుష్ప అనే బాలిక సోషల్ మీడియా వీడియోలు (రీల్స్) చేస్తూ 5వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందింది. నేపాల్ దేశానికి చెందిన పుష్ప తండ్రి ధను బహదూర్ జీవనోపాధి కోసం ఇక్కడికి వలస వచ్చి, అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. బాలిక కనిపించక పోవడంతో తల్లి కాజల్ వెతుకుతుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

సంబంధిత పోస్ట్