పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

1004చూసినవారు
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి తిరుపతికి వస్తున్న రైలు పట్టాలు తప్పడంతో, ఒక మిల్క్ ట్యాంకర్ బోగీ బోల్తా పడింది. ఈ ఘటనతో విజయవాడ–చెన్నై ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్