తిరుపతి బొమ్మగుంటలో అద్దె ఇంట్లో ఉంటున్న రాజేశ్వరి అనే మహిళపై ఇంటి ఓనర్ ఆనంద్ రావు, మరో ఇద్దరు కలిసి దాడి చేశారు. ఇల్లు ఖాళీ చేసే విషయంలో భర్త ఇంట్లో లేని సమయంలో రాజేశ్వరిని జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. స్థానిక ట్రాఫిక్ కానిస్టేబుల్ వారించినా వారు ఆగలేదు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.