ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారత సైనికులకు మద్దతుగా తిరుపతిలో శుక్రవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ సంస్థ ఆధ్వర్యంలో ఈ తీరంగా ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ లో ప్రాణాలు కోల్పోయిన వీరా జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ప్రతి ఒక్కరూ జాతీయ జెండాలు చేతబట్టి భారత్ మాతాకీ జై వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ భారీ తిరంగా ర్యాలీ చేపట్టారు.