తిరుపతి పోలీసులు APCLC రాష్ట్ర నేత క్రాంతి చైతన్యను జాతీయ చిహ్నాన్ని అవమానించిన ఘటనలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన జాతీయ చిహ్నాన్ని ఆవు తలతోపాటు ఖాకీ రంగు నిక్కరుతో ముద్రించి ఫ్లెక్సీలుగా ఏర్పాటు చేశారు. ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.