వరదయ్యపాలెం(M) కంచరపాలెంలోని చెరువు ఆయకట్టు కింద ఉన్న దాదాపు 50 ఎకరాల భూమికి కొందరు ప్రైవేటు వ్యక్తులు చెరువు మట్టిని కాజేసేందుకు గండి కొట్టి నీటిని బయటకు వదిలేశారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు వెంటనే స్పందించి గండిని పూడ్చి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.