తిరుమల లడ్డూ వ్యవహారంలో సీబీఐ SIT రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హయాంలో నెయ్యి సేకరణ నిబంధనల్లో మార్పులే కల్తీకి కారణమని నివేదిక తేల్చింది. అప్పటి, ప్రస్తుత ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అవినీతికి పాల్పడలేదని, అయితే ఈ వ్యవహారాన్ని గుర్తించడంలో విఫలమయ్యారని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని సీబీఐ పేర్కొంది. దీంతో అనిల్ కుమార్ సింఘాల్‌పై వేటు పడనుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.