తిరుపతి గ్రాండ్ వరల్డ్ రోడ్డులో చిరుత పులి సంచరించడం స్థానికుల్లో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఇళ్ల సమీపానికి వచ్చిన చిరుతను చూసిన ప్రజలు ఆందోళన చెందారు. కొందరు ప్రజలు ఇళ్ల పైకప్పుల నుంచి చిరుత సంచారాన్ని వీడియో తీశారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.