తిరుపతి నగరంలో మంగళం రోడ్డులోని భూపాల్ హౌసింగ్ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి చిరుత ప్రత్యక్షమైంది. ఒక ఇంటి ముందు ఉన్న కుక్కపై దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు సమాచారం అందుకుని, మృగాన్ని గుర్తించేందుకు మోషన్ కెమెరాలు, బోనులు ఏర్పాటు చేశారు.