తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారి చిరుజల్లులు మొదలయ్యాయి. గరుడ సేవ కోసం ఉదయ నుంచే గ్యాలరీల్లో వేచి చూస్తున్న భక్తులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. ఐదారు నిమిషాల పాటు వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. ఏటా గరుడ సేవ రోజున వర్షం కురవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా చిరుజల్లులు కురవడంతో భక్తులు దీనిని 'వేంకన్న లీల'గా భావించి ఆనందించారు.