తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ పరిధిలోని సదరన్ సూట్ లాడ్జిలో మేనేజర్‌పై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. రాజమండ్రికి చెందిన మేనేజర్ రాజ్‌కుమార్‌పై శనివారం గది బుక్ చేసుకున్న ముగ్గురు వ్యక్తులు, "హోటల్ లోకేషన్ పెట్టేది తెలియదా?" అంటూ వాగ్వాదానికి దిగి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, SI రామస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.