తిరుపతిలోని శ్రీసిటీ హెల్త్ కేర్ లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. బాయిలర్ పేలడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో 30 మంది కార్మికులు ఘటనా ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ టీమ్ 12 మంది క్షతగాత్రులను రక్షించి ఆస్పత్రికి తరలించింది. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.