తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి కర్ణాటకలోని రాయచూర్ జిల్లా నుంచి వచ్చిన భక్తుల బృందంలో ఓ బాలుడు తప్పిపోయాడు. మాధవ నిలయం వద్ద తల్లిదండ్రుల నుంచి వేరుపడిన బాలుడిని గుర్తించిన భక్తులు టీటీడీ హెల్ప్ డెస్క్‌కు తీసుకెళ్లారు. విజిలెన్స్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి తల్లిదండ్రులను గుర్తించి, అధికారుల సమక్షంలో బాలుడిని సురక్షితంగా అప్పగించారు. టీటీడీ తక్షణ చర్యపై భక్తులు ప్రశంసలు కురిపించారు.