రేణిగుంట బుగ్గవీధికి చెందిన శిరీష, 20 ఏళ్ల క్రితం చదువు ఆపేసినా, ప్రస్తుతం బ్యూటీపార్లర్ నడుపుతున్నారు. మరిన్ని కోర్సులు నేర్చుకోవడానికి టెన్త్ పాస్ అవసరం కావడంతో, తన చిన్న కుమారుడితో కలిసి పది
పరీక్షలు రాశారు. శిరీష 365 మార్కులతో, కుమారుడు 505 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. తల్లికొడుకులు ఒకేసారి టెన్త్ పాస్ అవ్వడం ఆ ఇంట్లో ఆనందాన్ని నింపింది. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని ఆమె నిరూపించారు.