తిరుపతిలో జరిగిన కూటమి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానం తిరుపతి నుంచే మొదలైందని, ఏడుకొండల స్వామి పునర్జన్మ ప్రసాదించారని గుర్తు చేసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వాలపై ప్రజల్లో అచంచలమైన విశ్వాసం ఉందని,
మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో
మోదీ, పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల ముందుకు వచ్చామని తెలిపారు.