తిరుపతిలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ప్రారంభం

1143చూసినవారు
తిరుపతిలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ప్రారంభం
37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా తిరుపతిలో అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు పోస్టర్లను ఆవిష్కరించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ నెల 31 వరకు “శిక్షణ ద్వారా భద్రత, సాంకేతికతతో మార్పు” అనే నినాదంతో విస్తృత ప్రచారం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడమే లక్ష్యమన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని అధికారులు కఠిన హెచ్చరిక జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్