తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం

184చూసినవారు
తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం రాజధాని అమరావతిలో మాట్లాడుతూ, లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక ఇచ్చిందని, తప్పు చేసిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పిస్తూ, ఆయన పాలనలో భక్తులు తిరుమలకు రావాలంటేనే అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్ జగన్ అన్యమతస్థుడైనప్పటికీ, డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని, శ్రీవారిపై నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దేవుడి పవిత్రత దెబ్బతీసేందుకే లడ్డూలో రసాయనాలు కలిపారని, సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ఇది ఉందని తెలిపారు. ఈ మహాపాపంపై వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పారా అని సీఎం ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్