నారాయణవనం మండలంలోని పాలమంగళం దక్షిణ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన మండల వైస్ ప్రెసిడెంట్ బాబూజీ ఆధ్వర్యంలో రాత్రి 8 గంటలకు భారీ కేక్ కట్ చేసి, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల యువత అధ్యక్షుడు నరేష్‌తో పాటు కూటమి నాయకులు, జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.