పెళ్లకూరు: పాము కాటుతో వ్యక్తి మృతి

1026చూసినవారు
పెళ్లకూరు: పాము కాటుతో వ్యక్తి మృతి
పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు గిరిజన కాలనీలో శనివారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మేకల కోసం పచ్చి గడ్డి కోయడానికి వెళ్లిన సత్యవేటి వీరయ్య (45) అనే రైతును పాము కాటేసింది. స్థానికులు అతన్ని నాయుడుపేట ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా, మార్గమధ్యంలోనే అతను మృతి చెందాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్