తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్,అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణ గురువారం దర్శించుకున్నారు.కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా స్వామివారికి ప్రత్యేక మొక్కులు చెల్లించారు.ఆలయానికి చేరుకున్న వారికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా,టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.