తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కారంపల్లి సమీపంలో పోలీసులు బుధవారం ఒక ఇంటిపై దాడి చేసి వ్యభిచార కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఈ ఘటనలో నిర్వాహకుడితో పాటు ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఇద్దరు మహిళలను రక్షించి హోంకు తరలించారు. సంఘటనా స్థలం నుంచి రూ.1,500 నగదు, 10 కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రామకిశోర్ తెలిపారు.