తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం

2099చూసినవారు
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో సైకాలజీ విభాగంలో జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటన కలకలం రేపింది. ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన విద్యార్థులపై విభాగ హెచ్ఓడి విశ్వనాథ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. "ర్యాగింగ్ చేస్తారు, ఏమైనా చేస్తారు" అని ఆయన వ్యాఖ్యానించినట్లు విద్యార్థులు తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు, హెచ్ఓడీ విశ్వనాథ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని యూనివర్సిటీ అధికారులను డిమాండ్ చేశాయి.

సంబంధిత పోస్ట్