రేణిగుంటలోని ఒక సూపర్ మార్కెట్‌లో విక్రయిస్తున్న చాక్లెట్లలో పురుగులు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా పిల్లలు తినే వైట్ క్యామెల్ చాకో డేట్స్ చాక్లెట్లలో పురుగులు కనిపించడంతో, వాటి నిల్వలను అధికారులు సీజ్ చేశారు. అలాగే, ల్యాబ్ పరీక్షల కోసం నమూనాలను సేకరించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి జగదీశ్ మాట్లాడుతూ, ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.