చంద్రగిరి హైవేపై ఉదయాన్నే రోడ్డు ప్రమాదం

1374చూసినవారు
చంద్రగిరి హైవేపై ఉదయాన్నే రోడ్డు ప్రమాదం
చంద్రగిరి మండలంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముంగిలిపట్టు సమీపంలో దామలచెరువు నుంచి తిరుపతికి ఖాళీ మామిడికాయల బాక్స్‌లతో వస్తున్న ట్రాక్టర్‌ను బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న భారీ కంటైనర్ ఢీకొనడంతో ఆరుగురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. దామలచెరువుకు చెందిన గిరి, శోభ, గోపి, మంజు, డ్రైవర్ చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్