తడలోని పెరియవట్టులో జరిగిన ప్రభాకరన్ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాత గొడవల నేపథ్యంలో ప్రణాళికబద్ధంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించి సూళ్లూరుపేట కోర్టులో హాజరు పరిచారు.