తిరుపతి జూలో జంతువుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల పులులు, చిరుతలు, వాలబీ వంటి అరుదైన జంతువులు అనారోగ్యం, వృద్ధాప్యంతో చనిపోతున్నాయని సమాచారం. ఇలా జంతువులు ఎందుకు చనిపోతున్నాయో అర్థం కావడం లేదని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూ అధికారులు జంతువుల ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త వహించాలని వారు కోరుతున్నారు.